చికిత్స పొందుతూ ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ మృతి
PPM: గుమ్మలక్ష్మీపురం మండలం బుడ్డెమ్మఖర్జ సమీపంలో రెండు బైకులు ఢీకొన్న ఘటనలో కిచ్చాడ పంచాయతీ ఉఫాది హామీ క్షేత్ర సహాయకుడు గోళ్ళ గౌరీశంకర్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అయితే ఆయన చికిత్స పొందుతూ విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మృతి చెందారు. దీంతో అధికారులు సంతాపం వ్యక్తం చేశారు. మృతుని గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.