వెల్నెస్‌ సెంటర్‌ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

వెల్నెస్‌ సెంటర్‌ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

NZB: కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు నిజామాబాద్‌ పాత మున్సిపల్‌ కార్యాలయం వెనుక ఉన్న వెల్నెస్‌ సెంటర్‌ను శనివారం అకస్మికంగా తనిఖీ చేశారు. సీనియర్‌ సిటిజన్లకు మెరుగైన వసతులు కల్పించాలంటూ సిబ్బందిని ఆదేశించారు. అవసరమైన వసతుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని సిబ్బంది కోరారు. సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేశారు.