VIDEO: ఖైరతాబాద్ గణేశుడిని చూశారా?

TG: HYDలోని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవం దేశవ్యాప్తంగా ప్రసిద్ది చెందింది. ప్రతి ఏటా వినాయకచవితి సందర్భంగా ఇక్కడ భారీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. 1954లో ప్రారంభించిన ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి నేటికి అంగరంగవైభవంగా కొనసాగుతోంది. పది రోజుల ఉత్సవాల అనంతరం విగ్రహాన్ని హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తారు. ఈ ఏడాది ఏర్పాటు చేసిన గణపతి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.