ప్రజావాణిలో 352 దరఖాస్తుల స్వీకరణ
KNR: ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, శాఖల వారీగా సమీక్షించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి 352 దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.