పేకాట శిబిరంపై దాడి.. 32 మంది అరెస్ట్

పేకాట శిబిరంపై దాడి.. 32 మంది అరెస్ట్

ELR: చింతలపూడి (M) శివపురం, కొమ్ముగూడెం గ్రామాల్లో పేకాట, కోడిపందాల శిబిరాలపై పోలీసులు నిన్న దాడులు నిర్వహించారు. సీఐ క్రాంతి కుమార్ పర్యవేక్షణలో జరిగిన ఈ దాడుల్లో 32 మంది జూదగాళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 20 మోటార్ సైకిళ్లను, 14 పందెం కోళ్లను, రూ. 30,180 నగదును స్వాధీనం చేసుకున్నారు. జూద క్రీడలు నిర్వహిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని SI సతీష్ కుమార్ హెచ్చరించారు.