అవుకు పెద్ద చెరువు కట్ట వద్ద కారు బోల్తా

NDL: అవుకు మండలం పరిధిలో శుక్రవారం ఉదయం తృటిలో పెను ప్రమాదం తప్పింది. అనంతపురం నుంచి బనగానపల్లికి వెళ్తున్న కారు అవుకు పెద్ద చెరువు కట్ట మలుపు వద్ద బైకు తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అప్రమత్తం కావడంతో కారులోని నలుగురు స్వల్పగాయలతో బయటపడ్డారు.