చెరువులోకి దూసుకెళ్లిన ఆటో.. డ్రైవర్‌ మృతి

చెరువులోకి దూసుకెళ్లిన ఆటో.. డ్రైవర్‌ మృతి

GNTR: పమిడిముక్కల మండలం విషాద ఘటన జరిగింది. మంటాడ నుంచి వీరంకిలాకు వెళ్లుతున్న ఆటో మంటాడ రెడ్డిపాలెం వద్ద అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో కృష్ణాపురం శివారుకు చెందిన ముసలానాయకుని పాలేని నాగరాజు (50) మృతి చెందాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆటోలో ఉన్న మరో ఇద్దరిని స్థానికులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.