VIDEO: క్రూడాయిల్ ప్రభావం.. ఒక్క రోజే 8 మంది
WGL: పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో క్రూడాయిల్ కొరత ఏర్పడి, వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై పనులు నిలిచిపోయాయి. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో ప్యాచ్ వర్క్ కోసం డాంబర్ తొలగించారు, సరఫరా లేకపోవడంతో పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. దీంతో రహదారిపై దుమ్ము, రాళ్లు వాహనదారులకు ప్రమాదంగా మారాయి. మంగళవారం ఒక్క రోజే 8 మంది గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించారు.