ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ
ప్రకాశం: ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని కనిగిరి మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. మంగళవారం మాజీ సీఎం వైయస్ జగన్ ఆదేశాల మేరకు పట్టణంలోని 14వ వార్డులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగాకోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు విద్యను దూరం చేస్తుందని తెలిపారు.