సెమిస్టర్ పరీక్షలు వాయిదా
SKLM: B.P.Ed & D.P.Ed 1వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఎచ్చెర్లలో డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వెల్లడించింది. పరిపాలనలో సమస్యల కారణంగా వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ ఎస్. ఉదయ భాస్కర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన కళాశాలలు, కేంద్రాలకు తాజా ప్రకటన జారీ చేశారు. కాగా ఈ పరీక్షలు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కావల్సి ఉంది.