నీటి సంఘం మాజీ ఛైర్మన్ మృతి

NLG: నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, నీటి సంఘం మాజీ ఛైర్మెన్ కొల్లు నర్సయ్య గౌడ్ గుండెపోటుతో మంగళవారం ఆకస్మికంగా మృతి చెందాడు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయనతో గ్రామానికి చెందిన నేతలు ఉన్నారు.