నేటి నుంచి గంగాభవాని అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
KDP: సిద్ధవటం మండలం మాధవరం-1 పరిధి బంగారుపేటలో వెలసిన శ్రీ గంగాభవాని అమ్మవారి 34వ వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి 26వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ప్రతినిధులు తెలిపారు. నేడు సాయంత్రం 4 గంటలకు లక్ష కుంకుమార్చన, 25న గణపతి హోమం, 26న బోనాలు ఉంటాయన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు తెలిపారు.