VIDEO: వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చూడాలి: మేయర్
KNR: కరీంనగర్ నగరంలో వేసవిలో తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. సోమవారం మున్సిపల్ కమిషనర్‌తో కలిసి ఫిల్టర్ బెడ్‌లను పరిశీలించిన ఆయన, యంత్రాల మరమ్మత్తులు వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి నగరవ్యాప్తంగా అంతరాయం లేకుండా నీటి సరఫరా జరిగేలా చూడాలని స్పష్టం చేశారు.