మాణిక్ బండార్‌లో AIKMS ఆధ్వర్యంలో నిరసన
NZB: దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మాక్లూర్ మండలం మాణిక్ బండార్ చౌరస్తా వద్ద AIKMS ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు నిరసన చేపట్టారు. ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సంక్షేమ బోర్డు నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు.