మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి జరిమానా

BDK: అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపిన కేసుల్లో కొత్తగూడెం జిల్లా కోర్టు 26 మందికి జరిమానాలు విధించింది. శుక్రవారం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు ఈ మేరకు తీర్పు వెల్లడించారు. కొత్తగూడెం వన్ టౌన్ ఎస్ఐ టీ.రాకేష్ తెలిపిన వివరాల ప్రకారం, వాహన తనిఖీల సమయంలో 13 మందిని ఆపి బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షించగా మద్యం చేవించినట్లు రుజువైందని తెలిపారు.