కుప్ప కొండకు నిప్పు
CTR: సోమల మండలంలో కొండలకు మూఢనమ్మకాలతో నిప్పు పెడుతున్నారు. మండల కేంద్రానికి ఒక కిలోమీటర్ దూరంలో జగనన్న కాలనీ సమీపంలోని కుప్పకొండకు గుర్తు తెలియని వ్యక్తులు శనివారం నిప్పు పెట్టారు. దీనితో మంటలు ఎగసిపడుతూ కొండ మొత్తం దగ్ధమవుతోంది. కొండలకు నిప్పు పెట్టడం ద్వారా మొక్కలు, వృక్షాలు దగ్ధమవడమే కాకుండా అటవీ జంతువులకు ఇబ్బంది కలుగుతోంది.