ఈనెల 30న జిల్లా స్థాయి సీనియర్ కబడ్డీ జట్ల ఎంపికలు

ఈనెల 30న జిల్లా స్థాయి సీనియర్ కబడ్డీ జట్ల ఎంపికలు

NZB: జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 30న జిల్లా స్థాయి సీనియర్ మహిళా, పురుషుల జిల్లా జట్ల ఎంపికల ప్రక్రియ నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగాధర్ రెడ్డి తెలిపారు. ఈ ఎంపికలు ముప్కాల్‌లోని భూదేవి ఇండోర్ స్టేడియంలో ఉ.10 గం.లకు ప్రారంభమవుతాయన్నారు. ఇందులో పురుషుల వ్యక్తిగత శరీర బరువు 85 kgలు, మహిళల శరీర బరువు 75 kgల లోపు ఉండాలన్నారు.