'ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించాలి'
VKB: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ సుధీర్ సూచించారు. పెద్దేముల్ జూనియర్ కళాశాలలో ఎన్నికల నిర్వహణ శిక్షణ తరగతులను సందర్శించారు. ఎన్నికల నియమ, నిబంధనలపై పూర్తి అవగాహనను ఏర్పర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రతన్ సింగ్, ఎంఈవో నర్సింగ్ రావు తదితరులు ఉన్నారు.