VIDEO: కొత్త బస్టాండ్‌లో భారీగా పోలీసుల మోహరింపు
SRCL: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఎస్పీ మహేష్ బి. గీతే ఆదేశాల మేరకు సిరిసిల్ల కొత్త బస్టాండ్‌లో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా టౌన్ సీఐ శ్రీనివాస్ అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. పోలీస్ బందోబస్తు మధ్య అద్దె బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. కాగా, కార్మికుల సమ్మెకు అద్దె బస్సులు నడిపే డ్రైవర్లు కూడా సహకరించాలని కోరారు.