మెగాస్టార్‌పై అసభ్యకర పోస్ట్‌లు.. కేసు నమోదు
HYD: మెగస్టార్ చిరంజీవిపై అసభ్యకర పోస్టులు దర్శనమిచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో చిరంజీవిని కించపరిచేలా అభ్యంతకర రీతిలో కొన్ని పోస్టులు పెట్టారు. ఈ పోస్టులపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జూబ్లీహిల్స్ PSలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సదరు పోస్టులు పెట్టిన ఖాతాల వివరాలను సేకరించేందుకు సైబర్ క్రైమ్ సహాయం కోరారు.