కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది: మంత్రి

కృష్ణా: ఆగిరిపల్లి మండలం చిన్న ఆగిరిపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన బడుగు సోమయ్య కుటుంబానికి టీడీపీ పార్టీ కార్యకర్తల సహాయ నిధి నుండి రూ. 5 లక్షల చెక్కును రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గురువారం అందించారు. మంత్రి పార్థసారథి మాట్లాడుతూ.. కార్యకర్తలకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు.