VIDEO: బలభద్రపురం RSK కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి
E.G: రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కూటమి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. బిక్కవోలు మండలం బలభద్రపురం RSK కేంద్రాన్ని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డితో కలిసి మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ధాన్యం తేమశాతాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.