డివైడర్‌ను ఢీ కొట్టిన మినీ వ్యాన్.. డ్రైవర్‌కు గాయాలు
E.G: నల్లజర్ల మండలం పుల్లలపాడు గ్రామ పరిధిలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. అటుగా వెళ్తున్న అశోక్ లేలాండ్ మినీ వ్యాన్ అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. దీంతో సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని బాధితుడిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.