టీటీడీ మాజీ ఛైర్మన్‌పై మంత్రి ఫైర్
ప్రకాశం: టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి విమర్శనాస్త్రాలు సంధించారు. ఒంగోలులో శుక్రవారం కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి మంత్రి స్వామి మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి కల్తీ జరిగిందనేది వాస్తవమని, ఇప్పటికైనా నిజాన్ని ఒప్పుకోవాలని మంత్రి సూచించారు. నిజాలు త్వరలోనే బయటపడతాయని హెచ్చరించారు.