'సైబర్ మోసాలతో జాగ్రత్త'
VKB: నకిలీ వీడియో కాల్స్ ద్వారా జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోడంగల్ ఎస్సై సత్యనారాయణ హెచ్చరించారు. తెలియని నంబర్ల నుంచి వచ్చే వీడియో కాల్స్‌కు స్పందించవద్దని సూచించారు. నగ్న దృశ్యాలను మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉందని తెలిపారు. ఇలాంటి మోసాలకు భయపడకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్సై కోరారు.