VIDEO: ఆర్టిజన్ కార్మికుల నిరసన ర్యాలీ
MDK: తూప్రాన్ పట్టణంలో తమను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని (కన్వర్షన్) డిమాండ్ చేస్తూ విద్యుత్ శాఖ ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన సమ్మె ఏడో రోజుకు చేరుకుంది. డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కార్మికులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని బాబాసాహెబ్ విగ్రహానికి సమర్పించి, తమకు న్యాయం చేయాలని కోరారు.