ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చిత్రపటానికి పాలాభిషేకం
ADB: సిరికొండ మండలంలోని సుంకిడి గ్రామానికి 42 కోట్ల రూపాయల వ్యయంతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మంజూరు కావడంతో గ్రామస్తులు, నాయకులు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చిత్రపటానికి ఇవాళ పాలాభిషేకం చేశారు. ఈ ప్రాజెక్ట్ మంజూరుతో రైతులకు మేలు జరుగుతుందని మాజీ సర్పంచ్ పెంటన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో తోకల చందు, జాదవ్ రోహిదాష్, తదితరులు ఉన్నారు.