ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు విద్యుత్ అలంకరణలు

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు విద్యుత్ అలంకరణలు

KDP: శ్రీ కోదండరామస్వామి ఆలయంలో మార్చి 26 నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ఘనంగా విద్యుత్ అలంకరణలు చేపడుతోంది. ఆలయం పరిసరాల్లో 60కి పైగా ఇల్యూమినేషన్ బోర్డులు, 20 వేల సీరియల్ లైట్లు, 10 వేల ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఏప్రిల్ 1న జరిగే శ్రీ సీతారాముల కల్యాణాన్ని భక్తులు వీక్షించేందుకు 23 ఎల్ఈడి స్క్రీన్‌లు కూడా ఏర్పాటు చేయనున్నారు.