అంతర్ జిల్లాల క్రీడా పోటీలు ప్రారంభం

అంతర్ జిల్లాల క్రీడా పోటీలు ప్రారంభం

NZB: మోపాల్ మండలం కంజర్ గ్రామంలో మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో అంతర్ జిల్లాల క్రీడా పోటీలను ప్రాంతీయ సమన్వయ అధికారి సత్యనాథ్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. అంతర్ జిల్లా క్రీడా పోటీలు ఈనెల 13వరకు జరుగుతాయని ఆయన తెలిపారు. ఆటలు ఆడటంవల్ల విద్యార్థుల్లో మనసు ప్రశాంతతో పాటు శారీరక దృఢత్వం మెరుగుపడుతుందని పేర్కొన్నారు.