పాక్‌తో క్రికెట్ ఆడడం సరికాదు: మాజీ క్రికెటర్

పాక్‌తో క్రికెట్ ఆడడం సరికాదు: మాజీ క్రికెటర్

భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నంతవరకు ఆ దేశంతో క్రికెట్ ఆడటం సరైంది కాదని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. దేశం కంటే ఏదీ ముఖ్యం కాదని.. మన జవాన్ల త్యాగం క్రికెట్ మ్యాచ్ కంటే చాలా గొప్పదని అన్నారు. సెప్టెంబర్ 14న దుబాయ్‌లో ఆసియా కప్-2025లో భారత్, పాకిస్తాన్ తలపడనున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.