గుంటూరులో ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా
గుంటూరులోని తూర్పు నియోజకవర్గం 11వ డివిజన్లో ముస్లిం మహిళలకు ఏకే సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా చీరలు, రంజాన్ తోఫా అందజేశారు. ఆర్గనైజేషన్ చైర్మన్ ఎస్. కె ఆశ మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసంలో పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ తోఫా అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ముస్లిం మహిళల పండుగ సంబరాలకు మద్దతు లభించింది.