పాదయాత్ర పోస్టర్లు ఆవిష్కరణ
AKP: నర్సీపట్నం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పాదయాత్ర పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఏప్రిల్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు అనంతపురం నుండి బండ్లపల్లి వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు. జి రామ్ జి పథకం రద్దు చేసి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అమలు చేయాలని పాదయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు.