వసతి గృహాన్ని సందర్శించిన ఆర్డీవో
NGKL: కల్వకుర్తి పట్టణంలోని బాలుర సంక్షేమ వసతి గృహాన్ని కల్వకుర్తి ఆర్డీవో ఎంపీ జనార్దన్ రెడ్డి సోమవారం సాయంత్రం సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న వసతులు సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సొంత డబ్బులతో సమకూర్చిన క్రికెట్ క్రీడా సామగ్రిని హాస్టల్ విద్యార్థులకు అందజేశారు.