బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి

బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి

కోనసీమ: బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి చెందిన ఘటన పి.గన్నవరం శివారు పల్లేరువారిపేటలో జరిగింది. కపిలేశ్వరపుర మండలం పల్లపులంకకు చెందిన వరప్రసాద్ తన స్నేహితులతో పెళ్లికి బైక్‌పై వెళ్తుండగా, ఈ ఘటన జరిగింది. దీంతో వరప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయలైన నాగేంద్ర, విజయపౌలును ఆసుపత్రికి తరలించారు. పెళ్లికి వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.