ఏన్కూరులో 101 మందిపై బైండోవర్ కేసులు

ఏన్కూరులో 101 మందిపై బైండోవర్ కేసులు

KMM: ఏన్కూరు మండలంలో ఎన్నికల ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మొత్తం 101మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఎస్సై సంధ్య తెలిపారు. వీరిలో 56 మంది బెల్ట్ షాపుల నిర్వాహకులు, ఆరుగురు రౌడీషీటర్లు, గతంలో కేసులు ఉన్నవారు ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నట్లు ఆమె తెలిపారు.