పెద్దకాపర్తి చెరువులో 'రాకాసి చేపలు' కలకలం
NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తి చెరువులో 'రాకాసి చేపలు' (డెవిల్ ఫిష్) కలకలం సృష్టిస్తున్నాయి. ఇవి చెరువులోని ఇతర చేప పిల్లలను తినడమే కాకుండా, వాటికి వేసే ఆహారాన్ని కూడా లాగేసుకుంటాయి. వీటి చర్మం గట్టిగా ఉండటం వల్ల జాలర్ల వలలు తెగిపోతున్నాయి. ఈ చేపలు చెరువులోని ఇతర చేప పిల్లలను తినేస్తుంటాయి. దీంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.