ఆగని ప్లాస్టిక్ కవర్ల వాడకం
GNTR: మంగళగిరిలో నిషేధిత ప్లాస్టిక్ కవర్ల వాడకం ఆగడం లేదు. 120 మైక్రాన్ల లోపు కవర్లు వాడొద్దన్న నిబంధనలు అమలుకావడం లేదు. వీటిని అమ్మితే రూ.2 వేల జరిమానా విధిస్తున్నా మార్పు లేదు. ప్రత్యామ్నాయంగా మార్కెట్లలో రూ.10కే జ్యూట్ బ్యాగ్ వచ్చే 'ఎనీ టైం బ్యాగ్' యంత్రాలను ఏర్పాటు చేశారు. అయితే సరైన ప్రచారం లేకపోవడంతో జనం ప్లాస్టిక్‌నే వాడుతున్నారు.