కమనీయం.. అప్పన్న కల్యాణం
VSP: సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవం ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ఉత్తర రాజగోపురం ఎదుట ఏర్పాటు చేసిన కల్యాణ వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలతో కలిసి సంప్రదాయబద్ధంగా కల్యాణం నిర్వహించారు. కల్యాణోత్సవానికి ముందు సింహగిరి మాడ వీధుల్లో స్వామివారిని ఊరేగించారు.