పత్తిని కొనుగోలు చేయాలని రోడ్డుపై బైఠాయించి ధర్నా

పత్తిని కొనుగోలు చేయాలని రోడ్డుపై బైఠాయించి ధర్నా

ATP: గుత్తి మార్కెట్ యార్డులో పత్తిను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రైతు సంఘం, సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన వ్యవసాయం మార్కెట్ యార్డు వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. రైతులు కొనుగోలు కేంద్రానికి తెచ్చిన పత్తిని తప్పనిసరిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.