సరస్వతి కెనాల్ ద్వారా నీటి విడుదల

నిర్మల్: శ్రీరాంసాగర్ జలాశయం నుంచి సరస్వతి కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా కెనాల్ నుంచి నీరు రాక పంటలు ఎండిపోయాయి. చేతికొచ్చిన పంట ఎండిపోవడంతో రైతులు సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నీటిపారుదలశాఖ అధికారులకు పంటలకు సాగు నీరు విడుదల చేయించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.