కోదాడ నుంచి అన్నవరం తీర్థయాత్రకు ప్రత్యేక బస్సు
SRPT: కార్తీక మాసం చివరి వారం సందర్భంగా కోదాడ ఆర్టీసీ డిపో నుంచి అన్నవరం యాత్రకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేశారు. నవంబర్ 14న శుక్రవారం రాత్రి 8 గంటలకు బస్సు బయలుదేరుతుందని డిపో మేనేజర్ శ్రీనివాసరావు సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దలకు రూ. 2000, పిల్లలకు రూ. 1200 ఛార్జీలుగా నిర్ణయించారు.