ప్రత్యేక అలంకరణలో నీలమణి దుర్గమ్మ

ప్రత్యేక అలంకరణలో నీలమణి దుర్గమ్మ

SKLM: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం పాతపట్నంలో కొలువైన శ్రీ నీలమణి దుర్గమ్మ ఆలయంలో 50వ వార్షిక నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అర్చకులు రాజేష్ అమ్మవారిని ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. అనంతరం చక్రార్చణ పూజాది కార్యక్రమాలు చేపట్టారు. ఆదివారం కావడంతో ఒడిశాతో పాటు పలు ప్రాంతాల నుంచి భక్తుల అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.