అమెరికా- ఇరాన్ మధ్యలోకి రష్యా

అమెరికా- ఇరాన్ మధ్యలోకి రష్యా

పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా- ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రష్యా కీలక ప్రకటన చేసింది. ఆ రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. పుతిన్ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు.