'త్రాగు నీటి కొరత ఉండకూడదు'
SKLM: గ్రామాల్లో త్రాగు నీటి కొరత ఉండకూడదని ఎమ్మెల్యే రవికుమార్ అన్నారు. బుధవారం జిల్లా జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వేసవిలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా సరఫరా ఆగిపోతే వెంటనే పరిష్కరించాలని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు వేగం పెంచాలని సూచించారు.