నేడు ప్రజాదర్బార్ నిర్వహించనున్న ఎమ్మెల్యే
కోనసీమ: అమలాపురంలో ఉన్న ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు క్యాంపు కార్యాలయం వద్ద ఆదివారం ఎమ్మెల్యే ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించాయి. నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్జీలు సమర్పించే ప్రతి ఒక్కరూ మొబైల్ నెంబర్, ఆధార్ కార్డు జిరాక్స్‌తో హాజరు కావాలన్నారు.