'పైప్ లైన్ పనులకు భూమి పూజ'

ప్రకాశం: దోర్నాల సుందరయ్య కాలనీ వాసులకు నీరు అందించే పైప్ లైన్ పనులకు మంగళవారం టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు భూమి పూజ చేశారు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని ఎరిక్షన్ బాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేజర్ సర్పంచ్ చిత్తూరు హారిక, ఎంపీడీవో నాసర్ రెడ్డి, ఇతర అధికారులు నాయకులు పాల్గొన్నారు.