VIDEO: పర్వతగిరిలో అదృశ్యమైన వ్యక్తి మృతి
WGL: పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన ఆకారపు రాములు (56) ఈ నెల 6న అదృశ్యమయ్యారు. ఇవాళ ఉదయం ఆకేరు వాగుపై పాత బ్రిడ్జి వద్ద ఆయన మృతదేహం లభ్యమైంది. సైకిల్‌తో సహా వాగులో పడటమే మృతికి కారణమని భావిస్తున్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు.