ఈనెల 22న జూనియర్ అథ్లెటిక్స్ క్రీడా పోటీలు

ఈనెల 22న జూనియర్ అథ్లెటిక్స్ క్రీడా పోటీలు

RR: రంగారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఈనెల 22వ తేదీన ఉదయం 8 గంటలకు జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు సంఘం కార్యదర్శి గోపి తెలిపారు. ఈ పోటీల్లో విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు ఆయన తెలిపారు. పూర్తి వివరాలకు రంగారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ కోచ్ సాయి రెడ్డిని సంప్రదించాలన్నారు.