11 నుంచి ఫార్మేటివ్ అసెస్‌మెంట్ పరీక్షలు ప్రారంభం

ATP: జిల్లాలో 1–10 తరగతుల ఫార్మేటివ్ అసెస్‌మెంట్ పరీక్షలు ఈనెల 11 నుంచి ప్రారంభం కానుండగా, ప్రశ్నపత్రాలు మండల విద్యాశాఖ కార్యాలయాలకు చేరాయి. 1–5 తరగతుల ప్రశ్నపత్రాలను క్లస్టర్ స్కూళ్లకు పంపించారు. 6–10 తరగతుల ప్రశ్నపత్రాలను ఎమ్మార్సీల్లో భద్రపరిచారు. పరీక్షకు గంట ముందు మాత్రమే పాఠశాలలకు బండిళ్లు అందజేస్తారు.