'రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా పనిచేయాలి'

CTR: రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా ప్రజా సంకల్ప వేదిక సభ్యులు పనిచేయాలని ఆ వేదిక జాతీయ అధ్యక్షులు మదిరె రంగసాయి రెడ్డి అన్నారు. ఆదివారం తిరుపతి నగరంలోని యూత్ హాస్టల్లో ఆ వేదిక రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవినీత రహిత సమాజమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.